Mahbubnagar: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Ragging Commotion At Mahbubnagar Government Medical College
x

Mahbubnagar: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Highlights

Mahbubnagar: పేరెంట్స్‌కు చెబితే ఇష్యూ పెద్దదవుతుందని కుమిలిపోతున్న జూనియర్లు

Mahbubnagar: తెలంగాణలోని కాలేజీల్లో ర్యాగింగ్ భూతం వీడడంలేదు. ఎక్కడో ఒక చోట జూనియర్ విద్యార్థులను.. సీనియర్లు వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. తాజాగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. హాస్టళ్లలో జూనియర్లను.. సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ల చేత సీనియర్లు మద్యం తెప్పించుకుని తాగుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. వేధింపుల ఘటనపై లెక్చరర్లకు ఫిర్యాదు చేస్తే.. అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు జూనియర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ర్యాగింగ్ అంశాలను తల్లిదండ్రులకు దృష్టికి తీసుకెళ్లేందుకు జూనియర్ విద్యార్థులు కుమిలిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories