Rafale Fighter Jets: రాఫెల్ యుద్ధ విమాన భాగాల తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభం – దసాల్ట్, టాటా గ్రూప్ కీలక భాగస్వామ్యం!

Rafale Fighter Jets: రాఫెల్ యుద్ధ విమాన భాగాల తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభం – దసాల్ట్, టాటా గ్రూప్ కీలక భాగస్వామ్యం!
x

Rafale Fighter Jets: రాఫెల్ యుద్ధ విమాన భాగాల తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభం – దసాల్ట్, టాటా గ్రూప్ కీలక భాగస్వామ్యం!

Highlights

హైదరాబాద్‌లో దసాల్ట్-టాటా భాగస్వామ్యంతో రాఫెల్ యుద్ధ విమాన భాగాల తయారీ కేంద్రం ఏర్పాటు.

Rafale Fighter Jets: భారతదేశ రక్షణ రంగంలో ఒక గొప్ప పురోగతికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్ అవియేషన్ (Dassault Aviation) మరియు టాటా గ్రూప్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూసలాజ్ తయారీ కేంద్రం ఏర్పాటవుతోంది. ఇది దేశీయంగా రాఫెల్ యుద్ధ విమాన భాగాలు తయారీకి తలుపులు తెరుస్తుంది.

ఈ కొత్త ప్లాంట్‌లో విమాన వెనుక భాగం, మధ్య భాగం, ముందు భాగంలోని కీలక నిర్మాణాలు ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటివరకు ఈ ఫ్యూసలాజ్ నిర్మాణం ఫ్రాన్స్‌లో మాత్రమే జరుగుతూ వచ్చిందని గుర్తుంచుకోాలి. కానీ, తొలిసారిగా భారత్‌లో ఈ ఉత్పత్తి చేయనుండటం విశేషం. 2028 నాటికి అసెంబ్లింగ్ లైన్ ప్రారంభమై, నెలకు రెండు ఫ్యూజలాజ్‌లను తయారు చేసి డెలివరీ చేసేలా ప్రణాళిక రూపొందించారు.

దసాల్ట్ అవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ప్రకారం, “ఈ ఒప్పందం భారతదేశ సరఫరా శ్రేణిని బలోపేతం చేయడమే కాకుండా, రాఫెల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తృతంగా పెంచుతుంది. టాటా లాంటి విశ్వసనీయ భాగస్వాములతో కలసి పనిచేయడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

ఇక టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరణ్ సింగ్ మాట్లాడుతూ, “ఈ ఒప్పందం భారతదేశంలో ఉన్న ఆధునిక ఎయిరోస్పేస్ నిర్మాణ సామర్థ్యాల ప్రతిఫలమే. ఇది దేశాన్ని అంతర్జాతీయ సరఫరా గొలుసులో కీలక భాగస్వామిగా మార్చనుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత శక్తివంతంగా ముందుకు నెడుతుంది” అని స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశం అంతర్జాతీయ ఎయిరోస్పేస్ రంగంలో మరింత ప్రాధాన్యతను సంపాదించే అవకాశాన్ని అందుకుంది. ఇదే సందర్భంగా దేశీయంగా ప్రస్తుత, భవిష్యత్ రక్షణ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి బలమైన అడుగు పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories