Corona: కరోనా నిబంధనలతో కొనుగోలు కేంద్రాలు

Purchasing Centers with Covid Regulations
x

కొనుగోలు కేంద్రం (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొంటామన్న సీఎం కేసీఆర్

Corona: తెలంగాణ వ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. గత ఏడాది మాదిరిగానే గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల 408 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటామని ప్రకటించారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు. కొనుగోలుకు అవసరమైన 20వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

యాసంగి వరి కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్ల అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్‌కి సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.. 6వేల 408 కొనుగోలు కేంద్రాల్లో 2వేల 131 ఐకేపీ సెంటర్స్.. 3వేల 9వందల 64 PACS కేంద్రాలు.. మిగతావి మరో 313 కేంద్రాలుండనున్నాయి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్ధతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు సీఎం. తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. 20కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులు చెప్పారు. వచ్చే వానాకాలం 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులను కోరారు.. 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. దాదాపు కోటి 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories