టీఆర్ఎస్ నేతలు పోచారం, ఎర్రబెల్లి, కడియం, వివేకానందకు కోర్టు సమన్లు

X
టీఆర్ఎస్ నేతలు పోచారం, ఎర్రబెల్లి, కడియం, వివేకానందకు కోర్టు సమన్లు
Highlights
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మాజీ మంత్రులు కడియం...
Arun Chilukuri22 Feb 2021 1:51 PM GMT
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మాజీ మంత్రులు కడియం శ్రీహరి, వేణుగోపాలాచారి, మండవ వెంకటేశ్వర్ రావు, దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే వివేకానంద, వేం నరేందర్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2005లో జరిగిన ఆందోళనలో పోచారంతో పాటు ఇతర నేతలకు సమన్లు జారీ చేసింది కోర్టు. మార్చి 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశింది.. 2016లో నిర్వహించిన ఆందోళనలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్ వివేకానందకు సమన్లు జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. వివేకానంద రాష్ర్టంలో లేరని పోలీసులు తెలపడంతో విచారణ మార్చి 8కి వాయిదా వేసింది కోర్టు.
Web Titlepublic representatives court issues summons to TRS Leaders
Next Story