అమ్మాయి మీద చెయ్యి వెయ్యాలంటే వణుకు పుట్టాలి ... కేసీఆర్ వీడియో వైరల్

అమ్మాయి మీద చెయ్యి వెయ్యాలంటే వణుకు పుట్టాలి ... కేసీఆర్ వీడియో వైరల్
x
CM kcr
Highlights

ఈ నేపధ్యంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రతపై ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

షాద్ నగర్ హత్య కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురు నిందితులను ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం చటాన్‌పల్లి దగ్గర సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు పోలీసులపై దాడికి ప్రయత్నించి.. పారిపోయే క్రమంలో కాల్చి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు చేసిన పనికి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. నిందితులకు సరైనా శిక్ష వేయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు పోలీసులుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రతపై ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడిపోవాలి అంటూ అయన చెప్పిన వీడియో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియలో కూడా ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే వ్యాఖ్యలను మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కూడా గుర్తు చేశారు. ఆడపిల్లల వైపు కన్ను ఎత్తి చూస్తే కళ్లు పీకి చూపిస్తామన్న కేసీఆర్ మాట తూటాలై తగిలాయి అన్నారు.

ఇక దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలోనే పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. అక్కడే గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చి డాక్టర్లు నిందితులు మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. నిందితుల తల్లిదండ్రులను పోలీసులు శంషాబాద్ కు తీసుకుని వచ్చారు. శవ పంచనామా పూర్తి కాగానే, వారి తల్లిదండ్రులు, ముఖ్య బంధువుల సమక్షంలోనే మృతదేహాలను వారికి అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఆపై సాయంత్రంలోగా వారికి అంత్యక్రియలను ఎవరి సంప్రదాయాల ప్రకారం వారు నిర్వహించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories