TRS to BRS: TRS పేరును BRSగా మారుస్తూ పబ్లిక్ నోటీస్.. అభ్యంతరాలుంటే..

TRS to BRS: టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 7 Nov 2022 1:21 PM IST
Public Notice Issue Over Change of TRS to BRS
X

TRS to BRS: TRS పేరును BRSగా మారుస్తూ పబ్లిక్ నోటీస్.. అభ్యంతరాలుంటే..

TRS to BRS: టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంపై టీఆర్‌ఎస్‌ పార్టీ పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఈసీకి తెలపాలని నోటీసులో కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలన ప్రకారం.. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రెసిడెంట్‌ పేరుతో ఈ ప్రకటన వెలువడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story