Malla Reddy: సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ..

Protest Against Minister Malla Reddy In His Own Place
x

Malla Reddy: సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. 

Highlights

Malla Reddy: ఇతర పార్టీలకు చెందిన వారి సమస్యలు పట్టించుకోమన్న మంత్రి

Malla Reddy: సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా ముదుచింతలపల్లి మండలంలోని పొన్నల్ గ్రామంలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డికి..తమ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామస్తులు తరలివచ్చారు. అయితే ఇతర పార్టీలకు చెందిన వారి సమస్యలను పట్టించుకోమని మంత్రి చెప్పడంతో.. పోలీస్ యంత్రాంగం ఆ గ్రామ ప్రజలను మంత్రి వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై పొన్నాల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్దామనుకున్న తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా గ్రామాన్ని సందర్శించని మంత్రి మల్లారెడ్డి.. ఎన్నికల వేళ..ఓట్ల కోసమే వచ్చారని పొన్నల్ గ్రామస్తులు మండిపడుతున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories