Telangana MLC Elections : ఎమ్మెల్సీ బరిలోకి ప్రొఫెసర్ నాగేశ్వర్

Telangana MLC Elections : ఎమ్మెల్సీ బరిలోకి ప్రొఫెసర్ నాగేశ్వర్
x
Highlights

Telangana MLC Elections : ఈ ఏడాది జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ పోటీ చేయనున్నారు....

Telangana MLC Elections : ఈ ఏడాది జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. 2007, 2009లలో ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన 2014 వరకు పదవిలో కొనసాగారు.

గత కొద్ది రోజులుగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పోటీ చేసే అంశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల మద్దతుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి రేపట్నుంచి ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరిస్తున్నారు అధికారులు. మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారులు ప్రకటించారు.

అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 6వరకు ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గ ఓటరుగా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.ceotelangana.nic.in అనే వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి పంకజ వెల్లడించారు. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం కూడా ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నట్లు తెలిసింది. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories