11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం

11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం
x
Highlights

తల్లిదండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా నమ్మేది గురువులనే. కాని పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పే గురువులే విద్యార్ధులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

తల్లిదండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా నమ్మేది గురువులనే. పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పే గురువులే విద్యార్ధులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అబం, శుభం తెలియని పిల్లల నిండు జీవితాలను చిదిమేస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్, బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్‌ను నడిపిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న బాలిక తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోయారు. ఫీజు కట్టేంత వరకు బాలికను ఉపాధ్యాయులు పరీక్షకు అనుమతించమని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి త్వరలోనే ఫీజు కడతామని, తమ అమ్మాయిని పరీక్షకు అనుమతించాలని కోరారు. దీంతో సరే అన్న ప్రిన్సిపాల్ ఇంతిజార్ ఆధార్, మరికొన్ని పత్ర్రాలను తీసుకొస్తే పరీక్షకు అనుమతిస్తానని చెప్పాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ అడిగిన పత్రాలను తీసుకుని స్కూలుకొచ్చారు. ప్రస్తుతం కంప్యూటర్ పనిచేయడం లేదని ప్రిన్సిపల్ వారికి చెప్పి వాళ్ళని ఇంటికి పంపించాడు. ఆ బాలికను క్లాసు కు వెళ్ళమన్నాడు. సాయంత్రం ఆ బాలికను ఆఫీస్ రూమ్ కి పిలిచిన ప్రిన్సిపల్ ఆధార్ కార్డును పరిశీలిస్తున్నట్టు నటిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

వెంటనే ఇంటికి పరుగుతీసిన బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నేరానికి ఒడిగట్టిన ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈఓ వేణుగోపాలచారి బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories