logo
తెలంగాణ

సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Prime Minister Modi Wished CM KCR on his Birthday
X

ప్రధాని మోదీతో సీఎం కెసిఆర్ ( పాత చిత్రం)

Highlights

*సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోది, ఇతర ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రోజు 66 వసంతాలు పూర్తి చేసుకుని 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అహింసే ఆయుధంగా, సంకల్పమే సాధనంగా, ఊపిరే పణంగా పెట్టి తెలంగాణ స్వరాష్ట్ర పోరులో విజేతగా నిలిచి.. తెలంగాణ తల్లిని బంధవిముక్తురాలిని చేసిన ఉద్యమ సారధి, తెలంగాణ ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.Web TitlePrime Minister Modi Wished CM KCR on his Birthday
Next Story