PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ వరుస పర్యటనలు

Prime Minister Modi for Telangana on October 1
x

PM Modi: అక్టోబర్‌ 1న తెలంగాణకు ప్రధాని మోడీ

Highlights

PM Modi: మహబూబ్‌నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించనున్న ప్రధాని

PM Modi: తెలంగాణలో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది. ఎన్నికలు సమీపిస్తుండంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం వచ్చే నెలలో కేంద్ర నాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ.

మూడు రోజుల గ్యాప్‌లోనే రెండుసార్లు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. అక్టోబరు ఒకటో తేదీన మహబూబ్‌నగర్, అక్టోబర్ 3న నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ వేదికల నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ప్రధాని మోడీ. మహబూబ్‌నగర్‌లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. గతంలోనూ మహబూబ్‌నగర్ ఎంపీ సీట్ కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీ.. మోడీ బహిరంగ సభతో పూర్తిస్థాయి పట్టు సాధించాలనే ఉత్సాహంతో ఉంది.

ఇటు నిజామాబాద్‌లో అక్టోబర్ 3న బహిరంగ సభ నిర్వహించనుంది రాష్ట్ర నాయకత్వం. ఈ సభలోనే పసుపు బోర్డును ప్రధాని మోడీ ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. తెలంగాణపై బీజేపీ నాయకత్వమే ఆపరేషన్ చేస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇకనుంచి తెలంగాణలో పొలిటికల్ స్ట్రాటజీని జాతీయ నాయకత్వమే అమలు చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు ఎన్నికల ముందు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనతో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories