ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ సంక్రమణ అరికట్టాలి..నగరపాలక కమీషనర్ వల్లూరు క్రాంతి

ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ సంక్రమణ అరికట్టాలి..నగరపాలక కమీషనర్ వల్లూరు క్రాంతి
x
Highlights

ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ సంక్రమణ అరికట్టాలన్నారు నగరపాలక కమీషనర్ వల్లూరు క్రాంతి.

కరీంనగర్ టౌన్ : ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ సంక్రమణ అరికట్టాలన్నారు నగరపాలక కమీషనర్ వల్లూరు క్రాంతి. కరోనా పట్ల నగర ప్రజలు భయపడాల్సిన పని లేదని...తగు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పారిశుధ్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి చెందకుండ తీస్కోవల్సిన చర్యలు, అరికట్టేందుకు పాటించాల్సిన జాగ్రత్తల పై పారిశుధ్య సిబ్బందికి సలహాలు సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్బంగా కమీషనర్ క్రాంతి మాట్లాడుతూ... ఇన్ స్పెక్టర్లు జవానులు పారిశుధ్య పనులను మరింత మెరుగు పరచాలని ఆదేశించారు. నగర పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ... చెత్త కలెక్షన్ పాయిట్లు...గార్బేజ్ పాయిట్ల వద్ద బ్లీచింగ్ చేయాలని కోరారు. ఎరియాల వారిగా కరోనా వ్యాది పై ప్రజల భయపడకుండ వారికి అవగహాన కల్పించాలని... సూచించిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇతర దేశాల నుండి వచ్చే వ్యక్తులను గమనించి... వారి వివరాలు ఫోన్ నెంబర్లను సేకరించి అందించాలన్నారు.

ఎవరైన అనుమానితులు మీ దృష్టికి వచ్చిన సమాచారం అందించాలని కోరారు. నగరంలో పందుల పెంపకం దారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని కోరారు. పారిశుధ్య కార్మీకులు మాస్కులు దరించి పని చేసే విధంగా ఇన్ స్పెక్టర్లు జవానులు సూచనలు చేయాలని కోరారు. నగర ప్రజలు వ్యక్తిగత శుభ్రత మరియు పరిసరాల శుభ్రత పాటించడం చాల ముఖ్యం అన్నారు. ఎక్కవ జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో తిరగకుండ జాగ్రత్తలు తీస్కోవాలని తెలిపారు.


దగ్గు, జ్వరంతో ఎవరైనా బాదపడితే కింద తెలిపిన హెల్ప్ లైన్ నెంబర్ 9849902501 కి సమాచారం అందించి... ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్కోవాలని తెలిపారు. మరో వైపు డిఎం&హెచ్ వో సుజాత మాట్లాడుతూ... కరోనా వైరస్ పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దు. వైరస్ రాకుండ వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. జ్వరం, దగ్గుతో బాదపడే వారు బయటి ప్రదేశాల్లో తిరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి.

తరుచు సబ్బుతో చేతులు శుభ్రం చేస్కోవడం... మనుషులకు 2 మీటర్ల దూరం ఉండటం లాంటి జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అని తెలిపారు. మీ ఏరియాలో అనుమానితులు ఎవరైన ఉంటే ఆరోగ్య శాఖ అధికారులకు మరియు అర్బన్ హెల్త్ డాక్టర్లకు సమాచారం అందించాలని కోరారు. ఇతర దేశాల నుండి ఎవరైన వస్తే వారి సమాచారం అందించాలని కోరారు. కరోనా రాకుండ ముందస్తు జాగ్రత్తలు తీస్కొని దాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని సుచించారు. ఈ సమానేశంలో ఆరోగ్య శాఖ అధికారులు సుజాత, జ్యోతీ, సానిటేషన్ సూపర్ వైజర్ వేణుమాదవ్, ఇన్ స్పెక్టర్లు, జవానులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories