కారు, కాంగ్రెస్‌ కలిసేనా..? టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచేనా..?

Prashant Kishor Trying to Unite Telangana Congress and TRS | KCR | Revanth Reddy | Live News
x

కారు, కాంగ్రెస్‌ కలిసేనా..? టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచేనా..?

Highlights

TRS - Congress: బీజేపీని గద్దె దింపేందుకు స్థానిక పార్టీలను ఏకం చేస్తున్న పీకే...

TRS - Congress: కాంగ్రెస్ పార్టీలో జాతీయ పరిణామాలు తెలంగాణ రాజకీయాల మీద ఎఫెక్ట్ చూపుతున్నాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లోకి ఎంట్రీతో స్టేట్ పొలిటికల్ సినారియో మారుతుంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వ ఏర్పాటును టార్గెట్ గా పెట్టుకున్న పీకే.. తెలంగాణలో కారు, కాంగ్రెస్ పార్టీలను కలుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చజరుగుతోంది. ఇక రెండు రోజులుగా పీకే ప్రగతి భవన్‌లోనే ఉంటూ కేసీఆర్‌ తో రహస్య మంతనాలుసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్​ మధ్య పొత్తుకు ఛాన్స్ అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్​ మధ్య పొత్తు ఉండదని రాహుల్​గాంధీ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైతే కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. కానీ ముందు ముందు వ్యూహకర్త వ్యూహాల్లో భాగంగా ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలులేకపోలేదు అనే కొత్త వాదన వినిపిస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.

టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ మాటిచ్చారు. కానీ ఇప్పుడు అదే పార్టీకి ఉనికి లేకుండా చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో ఇప్పటికే ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతోంది అనే సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్​తో కలిసేందుకు కేసీఆర్​వెనకాడబోరని కొందరు వాదిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్.. కాంగ్రెస్​ను వెనకేసుకొస్తూనే ఉన్నారు.

పీకే సాయం తీసుకున్న స్టాలిన్, ఉద్దవ్​ఠాక్రే ఎప్పటి నుంచో యూపీఏలో ఉన్నారు. శరద్​పవార్, ఉద్దవ్​ఠాక్రే ఇద్దరూ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హేమంత్​ సోరేన్​కూడా అంతే. ఇక ప్రశాంత్​కిషోర్​జాబితాలో ఉన్న ఏపీ సీఎం జగన్​, పశ్చిమ బెంగాల్​లో మమతకు కాంగ్రెస్​తో పని లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్​కిషోర్​ వ్యూహంలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్​కూడా ఇటీవల వివిధ రాష్ట్రాలు తిరిగారు.

జార్ఖండ్​వెళ్లి హేమంత్​సోరేన్​ను కలిశారు. అంతకు ముందు స్టాలిన్, శరద్​పవార్, ఉద్దవ్​ఠాక్రేలనూ కలిసొచ్చారు. కేసీఆర్​వెళ్లి వచ్చిన తర్వాతే శరద్ పవార్​ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్​ లేని కూటమి సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత కేసీఆర్​ ఢిల్లీ బాట పట్టినా.. ఆశించిన ఫలితం రాలేదని క్లియర్ గా అర్థం అవుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రశాంత్​ కిషోర్​వ్యూహకర్తగా పని చేస్తున్నారని సీఎం కేసీఆరే ఇటీవల స్వయంగా​ ప్రకటించారు.

కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనే ఇప్పుడు పీకే చర్చలు జరుపుతున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ​బలంగా మారుతున్నదని ఇటీవల కేసీఆర్ జరిపిన పలు సర్వేల్లో తేలినట్లు టాక్. అదే సమయంలో అసోం సీఎం హేమంత బిశ్వశర్మ ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీని ఉద్దేశించిన చేసిన కామెంట్స్ ను కేసీఆర్​ఖండించారు. రాహుల్​ను సపోర్ట్​ చేస్తూ మాట్లాడారు. అప్పటి వరకు కాంగ్రెస్​అంటేనే పడని కేసీఆర్​ఒక్కసారిగా ఈ తరహా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

మొత్తానికి ప్రశాంత్​ కిషోర్​ ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్​పొత్తుపెట్టుకునే అవకాశాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు. దీనికి తోడుగా రాష్ట్రంలో పీకే టీం ఇటీవల చేసిన సర్వేల్లో టీఆర్ఎస్​పై వ్యతిరేకత, కాంగ్రెస్​పై సానుకూలత పెరిగిందనే నివేదికను సిద్ధం చేసిచ్చారంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటే బీజేపీని అడ్డుకోవచ్చని పీకే వ్యూహంగా అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories