చిన్నారులు.. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..

చిన్నారులు.. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..
x
Highlights

వరుసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. 'అసలు వీళ్లు మనుషులేనా వీరికి మానవత్వం లేదా' అంటూ నిందితులపై ఆక్రోషం...

వరుసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. 'అసలు వీళ్లు మనుషులేనా వీరికి మానవత్వం లేదా' అంటూ నిందితులపై ఆక్రోషం వెల్లగక్కుతున్నారు. నింధితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా ప్రజా సంఘాలు ఆక్రందనను వ్యక్తం చేస్తున్నాయి. కన్నుమిన్ను కానకుండా కామాంధులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో అభం శుభం తెలియని చిన్నారులు మొదలుకొని.. మహిళలపై రోజు రోజుకు లైంగిక దాడులు అధికమవుతున్నాయి. వావి వరసలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి తేరుకోక ముందే ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనర్ బాలికపై సామూహిత అత్యాచారం ఘటన వెలుగుచూసింది.

వరంగల్, ఒంగోలు లో జిరిగిన దారుణ ఘటనలపై మహిళా, ప్రజా సంఘాలు భగ్గు మంటున్నాయి. నింధితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు. కామంతో కళ్ళు మూసుకుపోయి మహిళల జీవితం చిద్రం చేసిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వైఫల్యంతోనే అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు మావోయిస్టు నేత ఆర్కే సతీమణి ప్రమీల. నిఘా వైఫల్యం కారణంగానే ఒంగోలులో మైనర్ బాలికపై ఆఘాయిత్యం చోటు చేసుకుందన్నారు.

ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్‌ బాలికను రాష్ట్ర బాలల సంరక్షణ కమిషన్ సభ్యులు పరామర్శించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక పోవడం కూడా ఓ కారణమంటున్నారు బాలల సంరక్షణ కమిషన్ సభ్యులు. నిజామాబాద్ జిల్లాలోనూ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితున్ని గ్రామ బహిష్కరణ చేశారు. నిందితుడు జైలు నుంచి విడుదల అవుతున్నాడని తెలుసుకున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుని ఇంటిని మహిళలు ముట్టడించి తాళం వేసి నిరసన తెలిపారు. నిందితుడిని గ్రామంలోకి రానివ్వమంటూ శపదం పూనారు మహిళలు. మహిళలపై జరుగుతున్న ఘటనలు జగుప్సాకరమైన విషయమని.. సమాజం తలదించుకునేలా అగడాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories