ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
High court
తెలంగాణ ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య కోరారు. గంటల తరబడి ఒకే వాదనను వినిపించి విసిగిస్తున్నారని హైకోర్టు తెలిపింది. చట్టాన్ని అతిక్రమించి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తెలిపింది. ఇప్పటికిప్పుడు ఈ విషయంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన ధర్మాసనం.. తదుపరి విచారణను మంగళవారం నాటికి వాయిదా వేసింది.
Next Story




