Praveen Kumar: గ్రూప్1 పరీక్షల వాయిదా, కేసీఆర్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం

Postponement Of Group 1 Exams Is Proof Of KCR Government Failure Says Praveen Kumar
x

Praveen Kumar: గ్రూప్1 పరీక్షల వాయిదా, కేసీఆర్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం

Highlights

Praveen Kumar: నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ మంత్రివర్గాన్ని భర్తరఫ్ చేయాలి

Praveen Kumar: గ్రూప్1 పరీక్షల వాయిదాకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రివర్గాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఎస్పీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం బీఎస్సీ అభ్యర్థి దాసరి ఉష ఆధ్వర్యంలో ఆరు మండలాలకు చెందిన యువకులు, మహిళలు , మాజీ ప్రజాప్రతినిధులకు కండువాలు కప్పి బిఎస్పీ లోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుల కోసం ఇంతగానో నిరీక్షిస్తున్న ఆశావాహులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసంచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

చేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్1 పరీక్షల నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల బయోమెట్రిక్ర్ విధానం లేకుండానే ఓఎంఆర్ షీట్లు అందజేసినట్లు ఆరోపించారు. గ్రూప్ వన్ పరీక్షలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో వెంటనే టీఎస్పీఎస్సీ లోని సభ్యులను చేసి విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్షల్లో కుంభకోణానికి పాల్పడిన మంత్రి కేటీఆర్ ,శకవితలపై కూడా అధినేత న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ వన్ పరీక్షలు రాసి మోసపోయిన విద్యార్థులకు లక్ష నష్టపరిహారం అందజేయాల డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories