ఆర్టీసీని కావాలనే ప్రభుత్వం నిర్వీయం చేస్తుంది : పొన్నం ప్రభాకర్

ఆర్టీసీని కావాలనే ప్రభుత్వం నిర్వీయం చేస్తుంది : పొన్నం ప్రభాకర్
x
Highlights

కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఆర్టీసీని కావాలనే ప్రభుత్వం నిర్వీయం చేస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టీసీ ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆరోపించారు.

కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఆర్టీసీని కావాలనే ప్రభుత్వం నిర్వీయం చేస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టీసీ ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిరంకుశ వైఖరి వల్లే కార్శికులు సమ్మె చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కు పట్టడంలేదా అని మండిపడ్డారు.

ప్రభుత్వం 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా ఏం మొహం పెట్టుకుని కేటీఆర్ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే గర్వం పెరుగుతోందని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రన్ని అప్పుల పాలు చేశారని, అప్పులు రెట్టింపు చేస్తారని ఆరోపించారు. హుజూరునగర్ ఎన్నికలో కాంగ్రెస్‎కు ఓట్లు వేసి గెలిపించాలని పొన్నం కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories