వేడెక్కుతున్నహుజూర్‌నగర్ రాజకీయం

వేడెక్కుతున్నహుజూర్‌నగర్  రాజకీయం
x
Highlights

-సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో ఉత్తమ్ కుమార్ ప్రచారం -ఉత్తమ్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్న వీహెచ్, రాజయ్య,  బలరాం నాయక్  -హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం- ఉత్తమ్ కుమార్

హుజూర్ నగర్ ఉప ఎన్నికలు తేది సమీపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ ఎస్ తరపున మంత్రులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మెనేపథ్యంలో టీఆర్ ఎస్ కు మద్దతుపై ఇవాళ సీపీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.

ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్ తేది సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ ఎస్ , కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తన సతీమణి పద్మావతిరెడ్డి తరఫునఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఉత్తమ్‌తో పాటు వి.హెచ్ హనుమంతరావు, రాజయ్య, బలరాం నాయక్ పాల్గొన్నారు

ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా పీసీపీ చీఫ్ ఉత్తమ్ విమర్శలు గుప్పిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ లో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచ్య తండా, సుల్తాన్ పూర్ తండా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఆరేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉండి హుజూర్ నగర్ కు చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఓటర్లను అభ్యర్థించారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మెకు ముందు టీఆర్ ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెపై సర్కార్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆ పార్టీ అధికార పార్టీకి మద్దతుపై పునరాలోచన చేస్తామని చెప్పింది. ఈ విషయంపై ఇవాళ జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.

ఈ నెల 17న సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడే జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆర్టీసీ సమ్మెపై సర్కార్ వైఖరిపై గుర్రుగా ఉన్నసీపీఐ టీఆర్ ఎస్ మద్దతు ఇస్తుందా లేదా అన్నదానిపై అన్ని వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories