ఐటిఐఆర్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం

Politics around the ITIR project
x

ఫీల్ ఇమేజ్


Highlights

Telangana:గతంలో దుమారం రేగిన ఐటిఐఆర్ ప్రాజెక్టు పై తాజగా అన్ని ప్రధాన పార్టీలు లేఖలతో యుద్దం చేస్తున్నారు.

Telangana:తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికల వేళ నిరుద్యోగల అంశం రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉద్యోగాల భర్తీపై ప్రధాన పార్టీలు.. బిజేపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్లు చేస్తే.. తాజగా ఐటిఐఆర్ వైపు రాజకీయాలు మళ్లాయి. ఈ ఐటిఐఆర్ ప్రాజె్క్టు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి 2013 వరకు దానికి కావాల్సిన విధివిధానాలు... ప్రాజెక్టు కాస్టు... ఆ ప్రాజెక్టు కావాల్సిన సదుపాయాలు... భూముల వివరాలతో దాదాపు నాటి ప్రభుత్వం పూర్తి చేసినా.. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు... టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు ఏర్పాటు కాలేదనేది కాంగ్రెస్, బిజేపి ఆరోపిస్తున్నాయి.

నిరుద్యోగులపై జోరుగా చర్చ..

తాజాగా నిరుద్యోగులపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతుండడంతో ఐటిఐఆర్ ప్రాజెక్టుపై ఎందుకు ఇవ్వలేదని మంత్రి కేటిఆర్ కేంద్రానికి లేఖ రాశారు.ఐటీ పరిశ్రమలో అధ్భుత ప్రగతి సాధిస్తున్న హైదారాబాద్ కు ఐటీఐఆర్ హోదాను పునురుద్దరించాలని..లేదంటే అందుకు సమానమైన ప్రత్యేక హోదా అయినా ప్రకటించాలని కేటీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో కోరారు.

కేటీఆర్ లేఖతో మళ్లీ రాజుకున్నవివాదం...

ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్టు వివాదం కేటీఆర్ లేఖతో మళ్లీ రాజుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై టిఆర్ఎస్, బిజేపి రెండు దోషులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అతిపెద్ద ఐటిఆర్ఎస్ ప్రాజెక్టు యువకులకు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టు రాకుండా రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేశాయని హస్తం పార్టీ మండిపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేసింది.

సియం కేసిఆర్ కు ఎంపి బండిసంజయ్ బహిరంగ లేఖ

ఐటిఐఆర్ పై సియం కేసిఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపి బండిసంజయ్ బహిరంగ లేఖ రాశారు. కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్లే తెలంగాణకు ఐటిఐఆర్ ప్రాజెక్టు రాకుండా పోయింది నిజం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. 2017 సంవత్సరం చివరి వరకు కేంద్రం ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మైయిల్ ద్వారా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నిజం కాదా... ఎందుకు నాడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని నిలదీశారు. 2017 కాగ్ రిపోర్టులో కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం సహాయనిరాకరణ వల్లే.. ఐటిఐఆర్ ప్రాజెక్టు రాకుండా పోయింది అని తప్పును ఎత్తి చూపింది నిజం కాదా అన్నారు. ఈ భూముల కేటాయింపుల్లో ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని బిజేపి అనుమానం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ హాయంలో యాభూ వేల ఎకరాల భూమిని ఐటిఐఆర్ ప్రాజెక్టు కేటాయింపుకు ప్రతిపాదనలు పెడితే.. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం వెనుకడుగు వేసిందో చెప్పాలని డిమండ్ చేస్తుంది కమలం పార్టీ...

నిరుద్యోగులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరికి వాళ్లు నిరుద్యోగులను తమ వైపు తిప్పుకోవడానికి ఐటిఐఆర్ ప్రాజెక్టును రాకపోవడానికి కారకులు వీళ్లే అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాని కారణం ఏదైనా... లక్షల ఉద్యోగాలు రాకుండా పోయిన దాన్ని మళ్లీ తెచ్చే ప్రయత్నం మాత్రం చేస్తామని ఏ పార్టీ చెప్పడం లేదు. మరి ఈ ప్రతిపాదనతో ఎవ్వరు ముందుకు వస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories