కౌన్సిలర్ రవి నాయక్ హత్య వెనుక రాజకీయ కోణం..!

Political Angle Behind Councilor Ravi Nayaks Assassination | Breaking News
x

కౌన్సిలర్ రవి నాయక్ హత్య వెనుక రాజకీయ కోణం..!

Highlights

TS News: హత్య వెనుక ఎంపీ కవిత హస్తముందని సన్నిహితులతో అంటున్న శంకర్ నాయక్...

TS News: ఆ ఇద్దరి నేతల రాజకీయ వైరం ఇప్పటిది కాదు. తన ఇలాఖాలో జోక్యాన్ని సహించేది లేదని ఆ ఎమ్మెల్యే అంతరంగం. ఎలాగైనా సరే ఎమ్మెల్యే కావాలనేది ఆ ఎంపీ గారి అభీష్టమనేది లోకల్ టాక్. ఇది మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సూటిగా సుత్తిలేకుండా అందరూ మాట్లాడుకునే పొలిటికల్ గుసగుసల కరెంట్ ఎఫైర్స్ సారాంశం. ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య పొలిటికల్ హీట్ గులాబీదళంలో రెండువర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అని డిష్యుం డిష్యుం పాలిటిక్స్ నిత్యకృత్యం.

ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు అధికార టీఆర్ఎస్ నేతలు కావడం, మానుకోట కౌన్సిలర్ రవి మర్డర్‌తో మరింత హీటెక్కాయి. కౌన్సిలర్ రవి ఎంపీ కవిత అనుచరుడు కావడం, పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేకు నిరసన సెగ తగలడం..మర్డర్‌ ఇష్యూకు పొలిటికల్ టచ్ ఇచ్చింది. రవి హత్యకు ఇతర కారణాలు ఉన్నాయని పోలీసులు అంటున్నా... అసలు విషయం మాత్రం రాజకీయమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహబూబాబాద్‌లో కౌన్సిలర్ రవి నాయక్ హత్య వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ కవిత అనుచరుడు కౌన్సిలర్ రవి అని టాక్ వినిపిస్తుండగా.. రవిని హత్య చేసిన అరుణ్, శంకర్.., ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా కౌన్సిలర్ రవి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల హోలీ వేడుకల్లో మద్యం పంపిణీతో శంకర్ నాయక్ హల్‌చల్‌ చేయడంతో సీఎం కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు. అటు రైతు ధర్నాలో ఎంపీ కవిత చేతినుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కోవడంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories