సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కేసులే

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కేసులే
x
Representational Image
Highlights

కరోనా వైరస్ తీవ్ర‌రూపం దాల్చుతున్న‌ తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన పౌరులు కొందరు ఆకతాయిల్లా వ్యవహరిస్తున్నారు. త‌ప్ప‌డు సమాచారాల‌న్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

కరోనా వైరస్ తీవ్ర‌రూపం దాల్చుతున్న‌ తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన పౌరులు కొందరు ఆకతాయిల్లా వ్యవహరిస్తున్నారు. త‌ప్ప‌డు సమాచారాల‌న్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్న మ‌ద్యం షాపులు తెరుస్తారంటూ, లాక్‌డౌన్ ఎత్తేస్తారంటూ..ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌తో ఆడుకుంటున్నారు. మ‌రి కొంద‌రూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ ఆందోళనను కలిగిస్తున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ అన్ని సోష‌ల్ మీడియాల్లో వేదిక‌పై తమ కొంటెతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవ‌లే తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ జ్యోతి కొండెక్కిందని త‌ప్పుడు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నారు. అయితే, అలాంటివారిపై కేసులు పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధ‌మ‌య్యాయి. సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో వారు చేసిన పోస్టుల‌ను సుయోట‌గా తీసుకుని కేసులు న‌మోదు చేసేందుకు పోలీసులు సిద్ద‌మైయ్యారు.

అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందుగానే factcheck పేరుతో వె‌బ్‌సైట్ తెరిచి, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేస్తోంది. ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వారిపై కేసులు పెడుతోంది. మద్యంషాపులు తెరుస్తున్నార‌ని నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులు అత‌న్ని పట్టుకొని ఉస‌లు లెక్క‌బెట్టేలా చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories