మునుగోడు నియోజకవర్గంలో నోట్ల కట్టలు.. చల్మెడ చెక్‌పోస్ట్‌ దగ్గర కోటి రూపాయల నగదు స్వాధీనం

Police Seized Bundles of Notes in Munugode
x

మునుగోడు నియోజకవర్గంలో నోట్ల కట్టలు.. చల్మెడ చెక్‌పోస్ట్‌ దగ్గర కోటి రూపాయల నగదు స్వాధీనం

Highlights

Munugode: పట్టుబడ్డ నగదుపై విచారణ చేస్తున్న పోలీసులు.. కరీంనగర్‌లోని ఓ పార్టీ నాయకుడికి చెందిన నగదుగా అనుమానం

Munugode: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టబడుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలు పట్టుబడగా.. ప్రస్తుతం నియోజకవర్గంలోనే తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్ట్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా.. ఓ కారు నుంచి ఏకంగా కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదుపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే నగదు ఉన్న కారు.. కరీంనగర్ కు చెందిన ఓ పార్టీ నాయకుడిగా అనుమానిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల నగదు పట్టుబడగా.. నియోజకవర్గంలో ఇంత పెద్దమొత్తంలో దొరకడం ఇదే మొదటిసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories