ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసుల మోహరింపు

Police Security at CM KCR Residence in Delhi
x

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసుల మోహరింపు

Highlights

CM KCR: కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీస్‌ దగ్గర పోలీస్‌ బందోబస్తు

CM KCR: ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో సీఎం కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసుల భారీగా మోహరించారు. కవితకు మద్దతుగా ఢిల్లీ వచ్చారు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేసే అవకాశం ఉందన్న సమాచారంతో.. ముందస్తుగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో కాసేపట్లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈ నెల 11న సుమారు 9 గంటల పాటు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. 16వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ముందు హాజరుకానున్నారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన, సౌత్‌గ్రూపు పాత్ర, ఆప్‌ నేతలకు ముడుపులు తదితర అంశాలపై ప్రశ్నించడంతో పాటు బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాంలో ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమెకు మద్దతు అందించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌తోపాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించడంతోపాటు అక్కడి పరిణామాలను మంత్రులు ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories