పోలీసు శాఖలో కొత్త సంస్కతికి బాటలు..తొలిసారిగా రౌడీషీట్ మేళా

పోలీసు శాఖలో కొత్త సంస్కతికి బాటలు..తొలిసారిగా రౌడీషీట్ మేళా
x
Highlights

కొందరు నేర ప్రవృత్తిని ఎంచుకుని రౌడీలుగా మారితే మరికొందరు అనుకోకుండా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సత్పప్రవర్తన కలిగిన వారిని రౌడీషీట్ నుంచి విముక్తి...

కొందరు నేర ప్రవృత్తిని ఎంచుకుని రౌడీలుగా మారితే మరికొందరు అనుకోకుండా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సత్పప్రవర్తన కలిగిన వారిని రౌడీషీట్ నుంచి విముక్తి కల్గించేందుకు ఓరుగల్లు పోలీసులు కొత్త సంసృతికి బాటలు వేశారు. రాష్ర్టంలోనే తొలిసారిగా రౌడీషీట్ మేళ పెట్టి పలువురికి విముక్తి కల్గించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కొత్త సంస్కతికి బాటలు వేశారు. రాష్ర్టంలోనే తొలిసారిగా రౌడీషీట్ మేళ నిర్వహించి సత్ ప్రవర్తన కల్గి ఉన్న 113 మందికి రౌడీషీట్ నుంచి విముక్తి కల్పించారు. అనుకోకుండా వేర్వేరు సందర్భాల్లో కేసులు నమోదై కుటుంబ పరంగా ఇటు సమాజంలోనూ చిన్నతనంగా మారిన వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించారు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్.

వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీషీటర్ల ప్రవర్తనపై రిపోర్టు తెప్పించుకున్నారు వరంగల్ సీపీ డాక్టర్ విశ్వనాథ్ ఒకటికి రెండు సార్లు విచారణ జరిపారు. హన్మకొండలోని కమిషనరేట్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ మేళా నిర్వహించారు. రౌడీషీట్ నమోదై ఉన్న 783 మందిలో 133 మంది సత్ప్రవర్తనతో ఉన్నారని గుర్తించారు. నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు సీపీ విశ్వనాథ్. రౌడీషీట్ మేళపై పలువురు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ రౌడీషీట్ తొలగించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేయమని చెప్పారు. ఓరుగల్లు పోలీసుల నిర్ణయంతో ఇతర ప్రాంతాల్లోనూ నేరాల సంఖ్య తగ్గేందుకు దోహద పడుతుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories