Hyderabad: గన్‌పార్క్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. అమవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్న రేవంత్‌రెడ్డి

Police Heavily Deployed At Gunpark
x

Hyderabad: గన్‌పార్క్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. అమవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్న రేవంత్‌రెడ్డి

Highlights

Hyderabad: అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్

Hyderabad: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా, ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు అడుగుదామంటూ సీఎం కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ఇందులో భాగంగానే అమరవీరులస్థాపం వద్ద ప్రమాణం చేద్దాం రావాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్టు చేయాలా వద్ద అనే మీమాంసలో పోలీసులు ఉన్నారు. అరెస్టు తర్వాత జరిగే పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories