ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత.. డూట్యీకి వస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు

ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత.. డూట్యీకి వస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు
x
ఆర్టీసీ
Highlights

తెలంగాణలోని ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మె విరమణతో జేఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు డిపోలకు తరలివస్తున్న కార్మికులను పోలీసులు...

తెలంగాణలోని ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మె విరమణతో జేఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు డిపోలకు తరలివస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు లేకుండా చేర్చుకోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డిపోలో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇద్దరు కార్మికులు పోలీస్ స్టేషన్ భవనం పైకి ఎక్కి ఆందోళన చేయగా, పోలీసులు నచ్చజెప్పారు.

హైదరబాద్ లోని నాగోల్ బండ్లగూడ డిపో వద్దకు భారీ సంఖ్యలో మహిళా కార్మికులు తరలివచ్చారు. డ్యూటీలో చేరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని స్పష్టం చేశారు. వాగ్వాదానికి దిగిన మహిళా కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసుల వ్యాన్ లలో కొందరు మహిళా కార్మికులు రోధించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్‌ సమీపంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

జగిత్యాల డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ యూనియన్ల నాయకులతో కలిసి కార్మికులు డ్యూటీలో చేరేందుకు కార్మికులు రాగా పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాటల జరిగాయి. మహిళా కార్మికులను ఈడ్చుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కార్మికుడికి గుండెపోటు రాగా ఉపశమన చర్యలు చేపట్టారు.

మహబూబాబాద్ డిపోల్లో విధుల్లో చేరేందుకు రాగా, అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. మరోవైపు గట్టి బందోబస్తు మధ్య తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు.

హన్మకొండ డిపో వద్ద కార్మికుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. డ్యూటీలో చేరేందుకు వచ్చిన కార్మికులను అడ్డుకున్నారు. దుస్తులు పట్టి లాగి పోలీస్ వ్యాన్ వద్దకు ఈడ్చుకెళ్లారు. మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న కార్మికుడిని పోలీస్ అధికారి గల్లా పట్టి వ్యాన్ లో ఈడ్చేశాడు. పోలీసుల దౌర్జన్యంపై కార్మికులు మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories