హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ దగ్గర ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్

Police Arrest Raja Singh At Pragathi Bhavan
x

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ దగ్గర ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్

Highlights

Raja Singh: తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో ప్రగతిభవన్‌కు వెళ్లిన రాజాసింగ్

Raja Singh: హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ దగ్గర ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో ప్రగతిభవన్‌కు వెళ్లారు రాజాసింగ్. తన వాహనాన్ని మార్చాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు చెప్పారు రాజాసింగ్‌. అయితే.. తన విజ్ఞప్తిని అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఆయనే సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లారు. తన భద్రతను అధికారులు గాలికి వదిలేశారని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ప్రగతిభవన్‌ దగ్గర వదిలేయడంతో.. రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories