PM Modi: ఇవాళ తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ

PM Modi to visit Telangana Today
x

PM Modi: ఇవాళ తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ 

Highlights

PM Modi: మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్న ప్రధాని

PM Modi: ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా.. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ చేరుకోనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

మరో వైపు ప్రధాని టూర్‌కు సీఎం కేసీఆర్ గైర్హాజరు అవుతుండడంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు రహదారులు, ఎరువులు, కరెంట్ సమస్యలు తీరుస్తున్న ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

కాగా, మరోవైపు, ఇవాళ్టి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కూడా వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories