PM Kisan Yojana: ఇవాళ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల

PM Modi Going to Release Kisan Samman Yojana Funds Today
x

ఈ రోజు విడుదల కానున్న ప్రధాని మంత్రి కిసాన్ యోజన (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Kisan Yojana: ఇవాళ ప్రధాన మంత్రి కిసాన్ నిధి కింద నిధులు విడుదల * మధ్యాహ్నం 12:30 గంటలకు నిధులను విడుదల చేయనున్న మోడీ

PM Kisan Yojana: దేశంలోని అన్నదాతలకు కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈరోజు నిధులను విడుదల చేయనునున్నారు. ఈ మేరకు ప్రధాని ఆఫీస్‌ నుంచి ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి మోడీ నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్ల రైతులకు 19,500 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.

పీఎం కిసాన్ పథకం కింద, ఏడాదికి 6వేల చొప్పున రైతులకు అందిస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని నాలుగు నెలలకు ఓసారి 2వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు.

అలాగే, నిరుపేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్‌ అందించే ఉజ్వల 2.0 పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు, జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నట్లు పీఎంవో తెలిపింది. 5 కోట్ల మందికి లబ్ధిదారులకు కనెక్షన్లు అందించే లక్ష్యంగా 2016లో ఉజ్వల 1.0ను ప్రారంభించారు. తాజాగా బడ్జెట్‌లో ఉజ్వల 2.0 గురించి ప్రకటించారు. ఈ సారి కోటి మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories