ప్లాస్మా చికిత్స కరోనా బాధితులకు ఉపయోగపడుతుంది : మంత్రి ఈటల రాజేందర్

ప్లాస్మా చికిత్స కరోనా బాధితులకు ఉపయోగపడుతుంది : మంత్రి ఈటల రాజేందర్
x

Minister Etela Rajender

Highlights

Minister Etela Rajender At Plasma Donation Awareness Campaign : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా లాంటి అగ్రదేశాలే అతలాకుతలం అవుతుంటే మనం మాత్రం సమయస్ఫూర్తితో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

Minister Etela Rajender At Plasma Donation Awareness Campaign : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా లాంటి అగ్రదేశాలే అతలాకుతలం అవుతుంటే మనం మాత్రం సమయస్ఫూర్తితో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనా వైరస్ సోకితే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రావడానికి భయపడుతున్నారని, అలాంటి పరిస్థితిలో కూడా వైద్య సిబ్బంది రోగులకు తోడుగా ఉండటం అభినందనీయమని ఆయన అన్నారు. కరోనా సోకిన వారిలో కేన్సర్, మూత్రపిండాలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే బాధితులు దానికి తగిన విధంగానే చికిత్స తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆయా వ్యాధులతో మృతి చెందే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కరోనాకు మనోధైర్యమే ఒక పెద్ద మందు అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి సోకిన బాధితులకు ఉస్మానియాతో పాటు ఇతర ప్రభుత్వ ఆపత్రుల్లోనూ అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామన్నారు.

కరోనా కంటే తీవ్రమైన రోగాలు మనిషిని ఏమీ చేయలేకపోయాయన్నారు. వైద్యులు ఎంతో సాహసంతో చికిత్స చేస్తూ దేవుళ్ళ స్థానంలో నిలిచారన్నారు. దైర్యంగా ఉండి కరోనాను ఎదుర్కొనేలా అంతా కృషి చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ము కొని జీవిస్తాయన్నారు. ఒకరికొకరు సాయంగా ఉండాలనే విషయాన్ని కరోనా గుర్తు చేసింది. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం 2శాతం మంది మాత్రమే కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. వీలైనంత తొందరలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాము. ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నాయన్నారు.

ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు పోలీసులు అన్ని రకాలుగా తోడుగా ఉండటం అభినందనీయమన్నారు. ప్లాస్మా దానం చేసిన పోలీసుల్ని అభినందించి సన్మానించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కరోనా కు భయపడి, ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవడం సరైంది కాదన్నారు. ప్లాస్మా దానం కరోనా రోగులకు ఎంతో మనో ధైర్యాన్ని ఇస్తోందన్నారు. పోలీసులు సామజిక బాధ్యతతో పాటుగా ప్లాస్మా దానం చేయడానికి చొరవ తీసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. పలు ఔషధాల మాదిరిగానే ప్లాస్మా చికిత్స కూడా రోగులకు ఉపయోగపడుతోందన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories