తెలంగాణ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మేయర్

తెలంగాణ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మేయర్
x
Highlights

ఆరోగ్యం, విధ్యా విధానం సంపూర్ణ మార్పులు తీసుకవస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయిని పల్లి వినోద్ కుమార్.

కరీంనగర్ టౌన్ : ఆరోగ్యం, విధ్యా విధానం సంపూర్ణ మార్పులు తీసుకవస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయిని పల్లి వినోద్ కుమార్. వై.సునిల్ రావు మేయర్ గా నూతన భాధ్యతలు చేపట్టిన తర్వత మొదటి సారిగా సోమవారం రోజు ఉదయం కరీంనగర్ జిల్లా వచ్చారు. ఈ నేపథ్యం నగరపాలక సంస్థ మేయర్ వై.సునిల్ రావు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిని పల్లి వినోద్ కుమార్ తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. వినోద్ కుమార్ కు మేయర్ పూల మొక్కను అందించి...స్వాగతం పలుకుతూ... ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బి.వినోద్ కుమార్ మేయర్ వై.సునిల్ రావును శాలువా కప్పి...పూల మొక్కను అందించి అభినందనలు తెలిపారు.

అనంతరం మేయర్ వై.సునిల్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ లక్ష్మీ తో కలిసి తెలంగాణ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ... కరీంనగర్ నగర ప్రజలకు మేయర్ గా మంచి పరిపాలన అందించి... నగర అభివృద్ధి కృషి చేయాలని వై.సునిల్ రావుకు సూచించారు. నగర ప్రజలు కోరుకునే స్మార్ట్ సిటి కళను త్వరగా నేరవేర్చాలని...వాటి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.


స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్ పనులను ప్రారంభించి... ప్రారంభ మైన పనులను దశల వారిగా పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఉద్యమ స్పూర్తితో మీ ఉద్యోగ రిత్య ప్రజలకు సేవలందించాలని కోరారు. ముఖ్య మంత్రి కేసిఆర్ ఉద్యమ స్పూర్తితోనే యుద్ద ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 2 వందల టీఎంసీలకు పైగా గోదావరి నిటీని నిల్వచేయడం జరిగిందని తెలిపారు. కాళేశ్వర ప్రాజెక్టు వద్ద త్వరలో ఒక ఉద్యాన వనం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గోదావరి నిటీని ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, తోటపల్లి చెరువుతో సహా పలు ప్రాజెక్టులలో నీరు నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వైద్యం పట్ల పార్పులు తీసువస్తున్నామని ప్రజలకు మంచి వైద్యం, విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

రైతులకు, తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించే దిశగా రెవెన్యూ చట్టాలను మార్చుతున్నామని...ఈ విషయం పై ముఖ్యమంత్రితో సమావేశం అయ్యామని స్పష్టం చేశారు. తెలంగాణలో అక్షరాస్యత శాతం తగ్గిందని... అక్షరాస్యత శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి పలు కార్యాక్రమాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడ వారి పూర్తి సహాకారం అందించాలన్నారు. 2020 సంవత్సరంలో 360 రోజు ప్రతి ఉద్యోగి ఉద్యమ స్పూర్తితో పని చేసి...తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ లక్ష్మీ, మేయర్ వై.సునిల్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహాన్, సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యధర్శి తూం రవీంధర్, జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యధర్శి ఎండీ ఫయిజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories