టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!
x
Highlights

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో...

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తనకు భద్రత కల్పించే గన్ మెన్ల అవసరం లేదన్నారు. దీంతో భద్రతా సిబ్బందిని తిరిగి వెనక్కి పంపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. నిరాడంబరంగా ఉండడమే తనకు ఇష్టమని..హంగు ఆర్భాటాలతో ప్రజల్లోకి ఉండడం ఇష్టం ఉండదని అందులో పేర్కొన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేళ సెక్యూరిటీ నిర్బంధం నుంచి స్వేచ్ఛగా బయటకు వస్తానని తెలిపారు. తనకు ఎలాంటి భయం లేదని..ప్రజలే తనకు రక్షకులన్నారు కాంతరావు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories