Pilot Rohit Reddy: బీజేపీలో చేరేందుకు రూ.100కోట్లు ఆఫర్‌ చేశారు..

Pilot Rohit Reddy: ఫామ్‌హౌజ్‌ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 27 Oct 2022 11:18 AM IST
Pilot Rohit Reddy Claims he was Offered With Rs. 100 Crores
X

Pilot Rohit Reddy: బీజేపీలో చేరేందుకు రూ.100కోట్లు ఆఫర్‌ చేశారు..

Pilot Rohit Reddy: ఫామ్‌హౌజ్‌ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. డీల్‌లో భాగంగానే తన ఫామ్‌హౌస్‌కు వచ్చారని ఆయన చెప్పారు. బీజేపీలో చేరేందుకు 100కోట్లు ఆఫర్‌ చేశారని, ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50కోట్లు ఇస్తామని డీల్‌ మాట్లాడారన్నారు. బీజేపీలో చేరాలని స్వామీజీ, నందు, సతీష్‌ తనపై ఒత్తిడి తెచ్చారని పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. ఇక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదుపై మొయినాబాద్‌ పీఎస్‌లో స్వామీజీ, నందు, సతీష్‌ లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 120-B, 171-B, రెడ్‌విత్‌, 171-E, 506 రెడ్‌విత్‌, IPC 34, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్ - 1988 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story