ఫోటోలు మధురమైన జ్ఞాపకాలు

ఫోటోలు మధురమైన జ్ఞాపకాలు
x
పట్టణ ఎస్సై అనిల్ కుమార్, అధ్యక్షుడు బోయిని చంద్రశేఖర్, కార్యదర్శి హరీష్, కోశాధికారి సంతోష్
Highlights

జిల్లా కేంద్రంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై అనిల్ కుమార్ హాజరయ్యారు.

మెదక్: జిల్లా కేంద్రంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై అనిల్ కుమార్ మంగళవారం రాత్రి హాజరయ్యారు. మెదక్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఎస్సై చేతుల మీదుగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లకు గుర్తింపు కార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ... ఫోటోగ్రఫీ ఎంతో విలువైనదని, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ కెమెరాలు విలువైనవి కాబట్టి, రాత్రివేళల్లో ప్రయాణం తగ్గించుకోవలన్నారు. అలాగే విలువైన సామాగ్రికి ఇన్సూరెన్స్, మీరు లేబర్ ఇన్సూరెన్స్ చేసుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి, వాహనాలపై ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బోయిని చంద్రశేఖర్(చందు), కార్యదర్శి హరీష్, కోశాధికారి సంతోష్, ఉపాధ్యక్షులు మన్నే శ్రీనివాస్, దాసరి శ్రీధర్ మాజీ అధ్యక్షులు రామకృష్ణ, లక్ష్మణ్, ప్రభు, శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీధర్, జాకీర్, పాపయ్య, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories