TSPSC: గ్రూప్-2 గందరగోళం.. వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Petition In High Court For Postponement Of Group II Exams
x

TSPSC: గ్రూప్-2 గందరగోళం.. వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Highlights

TSPSC: ఒకే సారి అన్ని పోటీ పరీక్షలతో నష్టపోతామని పిటిషనర్ల ఆవేదన

TSPSC: గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రభుత్వ పరీక్ష తేదీని వాయిదా వేయాలని 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల పరీక్ష, జూనియర్ లెక్చరర్ల పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని పిటిషన్లో కోరారు.

బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలతోపాటు ఇతర పోటీ పరీక్షలు ఒకే సారి రావడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

గ్రూప్ -2 పరీక్షలను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే నెలలో ఇతర పోటీపరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏ పరీక్షకు హాజరు కావాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈనెలాఖరున ఎదురయ్యే పరిస్థితులపై రెండు వారాల క్రితం పరీక్షార్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌కు కలిసి విన్నవించారు. సర్వీస్ కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories