Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాకముందే ఉద్రిక్తతలు

Permission for Rahul Gandhis Visit to Osmania University
x

కాంగ్రెస్ అగ్రనేత రాకముందే ఉద్రిక్తతలు

Highlights

Telangana: హైకోర్టుకు చేరిన రాహుల్ గాంధీ సభ ఇష్యూ

Telangana: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు ముందే వాడివేడి పరిస్థితులు నెలకొంటున్నాయి. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూకి వచ్చేందుకు రాహుల్ కు పర్మిషన్ ఇచ్చేది లేదంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీంతో పర్మిషన్ ఇస్తారా? లేదా? అంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఓయూ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు NSUIనేతలు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కిటికీ అద్దం పగులగొట్టారు విద్యార్థులు. పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఓయూ పీఎస్ కు తరలించారు. వెంకట్ సహా 18 మందిని రిమాండ్ కు తరలించారు. ఇటు కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ను కూడా ముట్టడించారు.

ఈ నెల 7న ఓయూలో రాహుల్ ​గాంధీ సమావేశానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్​ ఓయూ టూర్ కు అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దీనికోసం టీపీసీసీ కార్యాచరణను సిద్ధం చేసింది.

విద్యార్థుల అరెస్ట్ కు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలనీ టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని NSUI నాయకులు కోరితే అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం అన్నారు. అరెస్టులకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా NSUI, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ తెలంగాణకు వస్తుంటే కేసీఆర్ కు ఎందుకంత భయమని ప్రశ్నించారు.

అరెస్టయిన విద్యార్థి సంఘాల నేతలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీకి వెళ్లి తీరతారని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ సాధారణ ఎంపీలా, ఓ సామాన్య పౌరుడిలా రాహుల్ ఓయూకి వెళతారని తెలిపారు. ఓయూని కేసీఆర్ తన సొంత జాగీరులా భావిస్తున్నారని మండిపడ్డారు.

ఓయూలో రాహుల్ గాంధీ సభ ఇష్యూ హైకోర్టుకు చేరింది. రాహుల్ సభకు అనుమతి కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ఓయూ జేఏసీ. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓయూ వైస్ చాన్స్ లర్, ఓయూ రిజిస్ట్రార్ ను ప్రతివాదులుగా చేర్చింది. పిటిషన్ పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అవుతారని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. ఈ మీటింగ్ లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండబోవన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశమే లేదని కోర్టుకు వివరించారు.

ఇక తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ సభకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్, ముఖ్య నేతలకు ఒక వేదిక రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఉండనుంది. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగించున్నారు. ఇక మరునాడు ఓయూ విద్యార్థులతో రాహుల్ మాట్లాడనున్నారు. కానీ అనుమతి నిరాకరండంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories