Top
logo

ఈసారి దీపావళికి తగ్గిన టపాసుల వల్ల ప్రమాద శాతం

ఈసారి దీపావళికి తగ్గిన టపాసుల వల్ల ప్రమాద శాతం
X
Highlights

ప్రతీసారి దీపావళికి క్రాకర్స్ కాలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలవుతుంటారు. ముఖ్యంగా కంటికి గాయమైతే బ్రతుకంతా చీకటే. ఐతే ఈ ఏడాది టపాసుల వల్ల కళ్లకు గాయాలైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

ప్రతీసారి దీపావళికి క్రాకర్స్ కాలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలవుతుంటారు. ముఖ్యంగా కంటికి గాయమైతే బ్రతుకంతా చీకటే. ఐతే ఈ ఏడాది టపాసుల వల్ల కళ్లకు గాయాలైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

ప్రతీ యేడు దీపావళికి ప్రమాదవశాత్తు కంటికి గాయాలై హైదరాబాద్ లోని సరోజిని కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో పేషేంట్లు వస్తుంటారు. గతేడాది ఇతర జిల్లాల నుంచి 30 మంది ఇన్ పేషేంట్లు అడ్మిట్ అవ్వగా, ఈసారి ఒక్కరు కూడా జాయిన్ కాకపోవడం గమనార్హం. అలాగే ఓపీకి కూడా కేవలం 10 మంది పేషేంట్లు మాత్రం వచ్చారు.

ఇక టపాసులు కాలుస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన కొందరు చిన్నారులను తమ తల్లిదండ్రులు హడావిడిగా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐతే ఓపికి వచ్చిన పేషేంట్లకు కూడా ప్రమాద తీవ్రత చాల తక్కువగా ఉండటం విశేషం.

ఈ ఎడాది కోవిడ్ ఎఫేక్ట్ తో టాపాసులు అమ్మకాలు, కొనుగోళ్ళు భారీ ఎత్తున తగ్గాయి. ఆ కారణంతోనే బాణాసంచా ప్రమాద శాతం తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు.

Web TitlePercentage of accidents due to reduced tapas for Diwali this time
Next Story