Jukkal: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: డీఎస్పీ

Jukkal: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: డీఎస్పీ
x
డీఎస్పీ సుదిరెడ్డి దామోదర్ రెడ్డి
Highlights

నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ డీఎస్పీ సుదిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

జుక్కల్: నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ డీఎస్పీ సుదిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారo కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడపగల్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులనుద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ... దొంగతనాల నివారణ కోసం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సీసీ కెమెరాల వల్ల దొంగతనం నివారణతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాల నివారణ కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ఇటీవల జరిగిన ఆన్లైన్ మోసాలపై గ్రామస్థులకు సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరు మహిళల పట్ల గౌరవభావంతో నడుచుకోవాలన్నారు. కార్డన్ సెర్చ్ సందర్బంగా ఎలాంటి పత్రాలు లేని 103 బైక్ లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్ వాడ సిఐ టాటా బాబు, బిచ్కుంద సిఐ సాజిద్ ఉల్ల, డివిజన్ స్థాయి ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories