Mangapet: న్యాయసేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి

Mangapet: న్యాయసేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి
x
Highlights

మండలంలోని కొమురం భీమ్ గ్రౌండ్ లో న్యాయ సేవల శిబిరాన్ని ఇంచార్జ్ ప్రిన్సిపాల్, జిల్లా జడ్జీ ప్రభాకర్ రావు ప్రారంభిచారు.

ఏటూరునాగారం: మండలంలోని కొమురం భీమ్ గ్రౌండ్ లో న్యాయ సేవల శిబిరాన్ని ఇంచార్జ్ ప్రిన్సిపాల్, జిల్లా జడ్జీ ప్రభాకర్ రావు ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు న్యాయస్థానం, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

న్యాయస్థానం, కేసులపై అవగాహనా కల్పించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయస్ సేవాశిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. న్యాయస్థానానికి పేద, దనికుడు అనే తారతమ్యం లేదన్నారు. న్యాయం కోసం తమను ఆశ్రయిస్తే ఒక లాయర్ను ఏర్పాటుచేసి, వారి పక్షాన కేసు వేసి ఉచితంగా వాదించి న్యాయం చేస్తామన్నారు. పలు గ్రామాల నుంచి న్యాయ సేవల శిబిరానికి ప్రజలు తరలివచ్చారు.

అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్ళు, వృద్దులు, వితంతువులు, రైతుబందు, పలు కార్పొరేషన్ లనుంచి ఎంపికయిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పలు గ్రామపంచాయతీ లకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీ మహేష్ నాధ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ హనుమాన్ కె జండగే, ఎస్పీ సంగ్రామ్ సింగ్, డీ ఎఫ్ ఓ ప్రదీప్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories