హరితహారం మొక్కల సంరక్షణ లో భాగస్వాములవుతున్న గ్రామస్తులు

హరితహారం మొక్కల సంరక్షణ లో భాగస్వాములవుతున్న గ్రామస్తులు
x
Highlights

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు భాగస్వాములవుతున్నారు.

బిచ్కుంద: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు అంతరించి పోతున్న అటవీ సంపద, పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో గత 5సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు భాగస్వాములవుతున్నారు.

అదే క్రమంలో మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో, గ్రామానికి చెందిన వార్డు సభ్యడు సాయిలు హరితహారంలో నాటిన మొక్కలకు, శుక్రవారం గ్రామంలోని కాలనీలలో సి సి రోడ్డు కు ఇరువైపుల నాటిన మొక్కలకు నీటిని పోశారు. నాటిన మొక్కలను సంరక్షించక పోయినట్లయితే, రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, ప్రతి ఒక్కరు భాగస్వాములై నాటిన మొక్కలను నీరు పోసి, ప్రతి మొక్కను కాపాడాలని కోరుతున్నాడు. మొక్కల సంరక్షణలో గ్రామసర్పంచ్ జె శివానంద్ అప్ప, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ మల్లికార్జున్ లు సైతం భాగస్వాములవుతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories