కరోనా వ్యాక్సిన్ కోసం క్యూడుతున్న ప్రజలు

కరోనా వ్యాక్సిన్ కోసం క్యూడుతున్న ప్రజలు
x

ఫైల్ Image

Highlights

Telangana:కరోనా టీకాలు వేయించుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు కడుతున్నారు.

‌‌‌Telangana: కరోనా టీకాలు వేయించుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు కడుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మూడు రోజులుగా కొనసాగుతున్న పంపిణీలో దాదాపు 90 శాతానిక పైగా లబ్ధిదారులు టీకాలు వేయించుకున్నారు. దీంతో గురువారం నుంచి అన్ని జిల్లా, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలివ్వాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. మరో వైపు స్పందన అధికంగా ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కేంద్రాల సంఖ్య, రోజువారీ టీకాల పరిమితిని కూడా పెంచారు. నెల రోజుల దాకా స్లాట్లు బుక్ అయ్యాయన్న ప్రచారం వట్టిదేనని, ఈ ప్రచారం కారణంగా వచ్చే వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ సెంటర్లలో రద్దీ ఉండకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌‌లోని అన్ని సెంటర్ల వద్ద ఆన్‌‌సైట్‌‌ రిజిస్ర్టేషన్ అందుబాటులో ఉంటుందని, నేరుగా తమకు నచ్చిన సెంటర్‌‌‌‌కు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. నాలుగైదు కార్పొరేట్ హాస్పిటళ్లలో మాత్రమే ఎక్కువ రిజిస్ర్టేషన్లు అయ్యాయని, అక్కడ రోజుకు 200 మందికే వేయాలన్న అప్పర్ లిమిట్‌‌ విషయంలో సడలింపును ఇచ్చామని తెలిపారు. ఆ సెంటర్ల వద్ద కూడా ఆన్‌‌సైట్ రిజిస్ర్టేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌తో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్​లో ఒక్కో డోసుకు రూ.250 దాకా తీసుకుంటుండడమే కారణమని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ప్రభుత్వ సెంటర్ల కంటే, ప్రైవేట్‌లో టీకా వేసుకునేందుకే జనం మొగ్గు చూపుతున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories