పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆడియో లీక్

Peddapalli BJP president Somarapu Satyanarayana Audio Leak
x

Somarapu Satyanarayana (file image)

Highlights

* మాజీ ఎంపీ వివేక్ వ్యవహార శైలిపై సోమారపు అసంతృప్తి * వివేక్ వచ్చిన తర్వాత గ్రూపులు ఎక్కువ అయ్యాయి: సోమారపు * నేను లేకుండానే మీటింగ్‌లు పెట్టారు: సోమారపు

పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆడియో లీక్ పెద్ద దుమారాన్ని రేపింది. జిల్లా అధ్యక్షుడిగా ఉండడం తనకు ఇబ్బందిగా ఉందని వేరే జిల్లాకు నియామించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాయడంపై స్పష్టత ఇచ్చారు. మాజీ ఎంపీ వివేక్ వ్యవహార శైలీపై సోమారపు సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వచ్చిన తర్వాత గ్రూపులు ఎక్కువ అయ్యాయని ఒక మండల కార్యకర్తలో సోమారపు అన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాను లేకుండానే వివేక్ మీటింగ్‌లు పెడుతున్నారని పార్టీ ఫ్లెక్సీల్లోనూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చాలాకాలంగా ఉంటున్నానని బండి సంజయ్ తనకే ప్రయార్టీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఈ ఆడియోపై సోమారపు సత్యనారాయణ స్పందించడం లేదు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్దపల్లి బీజేపీ పార్టీలో ముసలం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories