Pawan Kalyan: ఈనెల 26న కూకట్‌పల్లిలో పవన్ కల్యాణ్‌ పర్యటన

Pawan Kalyan Visit To Kukatpally On 26th Of This Month
x

Pawan Kalyan: ఈనెల 26న కూకట్‌పల్లిలో పవన్ కల్యాణ్‌ పర్యటన 

Highlights

Pawan Kalyan: ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం

Pawan Kalyan: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈనెల 26న పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ , జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం జరుపుతారని వెల్లడించారు.

KPHB కాలనీలోని ఓ హోటల్ లో జనసేన పార్టీ ఐటి సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీని నియోజకవర్గ వ్యాప్తంగా బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో గెలిచే దిశగా ముందుకు వెళ్లేందుకు కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని... ఈ ఎన్నికల విజయాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభావాన్ని చూపుతాయని తెలియజేశారు. ప్రతి కార్యకర్త గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories