Pawan Kalyan: పవన్ మ్యానియా తెలంగాణలో పని చేస్తుందా..?

Pawan Kalyan Enters Telangana Election Campaign
x

Pawan Kalyan: పవన్ మ్యానియా తెలంగాణలో పని చేస్తుందా..? 

Highlights

Pawan Kalyan: పవన్ ఎంట్రీతో సెటిలర్ల ఓట్లు బీజేపీ వైపు మల్లుతాయా..?

Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దూకారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని.. రెండు పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేనాని. ఐతే ప్రచారం చేసినంత మాత్రాన పవన్.. స్టార్ ఇమేజ్ తెలంగాణలో పని చేస్తుందా..? ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయా అనే చర్చ జరుగుతోంది. జనసేనతో బీజేపీ పొత్తు వ్యూహం ఫలిస్తుందా..? పవన్ సపోర్ట్, ప్రచారం ఎన్నికల్లో బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఆసక్తిగా మారింది.

పవన్ కల్యాణ్.. సినిమాలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ ఆ ఇమేజ్‌ ఎన్నికలకు వచ్చే వరకు ఓట్లుగా మారుతాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్‌ను తెలంగాణ ఎన్నికల్లోనూ రంగంలోకి దింపింది తెలంగాణ బీజేపీ.

పవన్ అభిమానులతో పాటు.. జనసేన కేడర్, ఆంధ్రా సెటిలర్ల ఓట్లను దృష్టిలో పెట్టుకుని జనసేనతో పొత్తు మంతనాలు నడిపింది. జనసేనకు 8స్థానాలు ఇచ్చి.. మిగతా స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలని కోరింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఎక్కువగా ఏపీపైనే దృష్టి పెట్టారు. జనసేనకు తెలంగాణలో పెద్దగా కేడర్ కానీ, లీడర్లు కానీ లేరు. కానీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో.. కొంత వరకైనా అది ఓటు బ్యాంకుగా మారుతుందనే ఆశతో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఏపీలోనే పవన్ సినిమా ఇమేజ్‌ పెద్దగా పని చేయలేదు. కేవలం జనసేన ఒక్కటి అంటే ఒక్క సీటే గెలిచింది. పవన్ రెండు చోట్లా పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు.

అలాంటిది తెలంగాణలో పవన్ ఇమేజ్ పని చేస్తుంది అనుకోవడం, అభిమానుల రూపంలో ఓట్లు పడతాయి అనుకోవడం అత్యాశే అవుతుందని చెప్పాలి. తెలంగాణలో పవన్‌ను ఒక్క సినిమా నటుడిగానే చేస్తున్నారు. తప్ప ఆయనను నాయకుడిగా గుర్తించడం లేదని పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చ. పవన్ ను చూడడానికి జనం వస్తారు కానీ అవి అన్నీ ఓట్లుగా మారుతాయని అనుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో నిన్నటి వరకు పవన్ యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు. అసలు ఎన్నికల్లో పోటీ చేద్దామనే ఉద్దేశంలో కూడా కనిపించలేదు. కేలవం బీజేపీ ఒత్తిడి మేరకు పవన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఓట్లు వచ్చే నేతను.. తెలంగాణ ప్రజలు నమ్ముతారని, అభిమానాన్ని క్యాష్ చేసుకుని ఓట్లు రాల్చుకుందామనికున్న బీజేపీ ‌ఎత్తుగడ పెద్దగా పనిచేయక పోవచ్చనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories