ప్రారంభమైన రైళ్లు : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సందడి

ప్రారంభమైన రైళ్లు : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సందడి
x
Highlights

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడుతోంది. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడుతోంది. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకుంటున్నారు. స్టేషన్లో ప్రయాణికుల మధ్య దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. ఆరోగ్య పరీక్షలు చేశాక సమస్యలు లేని వారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

ప్రయాణికుల్లో కరోనా అనుమానితుల కోసం ఒక్కో రైల్లో 3 పీపీఈ కిట్లను ఉంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్‌ ఛార్జీలతోనే టికెట్లు ఇస్తుండగా, జూన్‌ 29వ తేదీ నుంచి తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ మొదలవుతుంది. కాగా, హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ దేశరాజధానికి బయల్దేరింది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories