Mahabubabad: రజాలిపేటలో భయాందోళనలు.. ఇళ్ల ముందు రక్తం మరకలు

Panic In Rajampet Of Mahabubabad District
x

Mahabubabad: రజాలిపేటలో భయాందోళనలు.. ఇళ్ల ముందు రక్తం మరకలు

Highlights

Mahabubabad: ఇళ్ల డాబాలపై, గడపలపై రక్తం చల్లుతున్న గుర్తు తెలియని వ్యక్తులు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రక్తపు మరకలు కలకలం రేపుతున్నాయి. పట్టణ శివారులోని రజాలిపేటలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో రక్తం చల్లారు. ఆదివారం రాత్రి ఇళ్ల ఎదుట, డాబాల మీద, గడపల మీద రక్తం చల్లారు. సోమవారం ఉదయం లేవగానే ఇళ్ల ముందు, గోడల మీద రక్తపు మరకలు కనిపించాయి. ఒకటి కాదు..రెండు కాదు.. గ్రామంలోని చాలా ఇళ్లల్లో ఇలాంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది.

ఎక్కడో జంతువులను చంపి.. ఆ రక్తాన్ని ఇళ్ల దగ్గర చల్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానికులు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు రక్తపు మరకలపై దర్యాప్తు చేస్తు్న్నారు. పోలీసులకు కూడా అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాలేదు. అయితే ఎవరో క్షుద్రపూజలు చేసి, ఆ రక్తాన్ని ఇళ్ల ముందు చల్లారని కొందరు భావిస్తుంటే.. గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో కావాలనే ఇలా చేసి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి రజాలిపేట బ్లడ్ మిస్టరీ... గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా మొదలైంది. తమను ఎవరైనా ఏమైనా చేస్తారనే ఆందోళనలో పడ్డారు స్థానికులు. ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేసి.. త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories