ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో పాలమూరు యువతి మృతి

X
Highlights
* బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ * డిసెంబర్ 31న తేదీన స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం
Sandeep Eggoju2 Jan 2021 7:40 AM GMT
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి రక్షిత మృతి చెందింది. గురువారం ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలోని IIBITయూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నది.
గురువారం బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న విషయంతెలుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రక్షిత మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షిత తండ్రి వెంకట్ రెడ్డిఆర్మీలో పనిచేసి స్వచ్ఛందంగా రిటైరై ప్రస్తుతం డీఆర్‌డీఏలో ఉద్యోగం చేస్తున్నారు.
Web Titlepalamuru child dies in road accident in australia
Next Story