Karimnagar: భూవివాదంలో యజమానిపై దాడి.. నిందితులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు

Owner Was Attacked In A Land Dispute Locals Tied The Accused To A Tree In Karimnagar
x

Karimnagar: భూవివాదంలో యజమానిపై దాడి.. నిందితులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు

Highlights

Karimnagar: భూమి తమదేనని బెదిరింపులకు దిగిన ముగ్గురు వ్యక్తులు

Karimnagar: కరీంనగర్ జిల్లా జిల్లా లోని చెంజర్ల గ్రామంలో భూవివాదంలో ముగ్గురు వ్యక్తుల్ని గ్రామస్తులు చెట్టుకు కట్టి బంధించారు. స్థానిక సంఘమిత్ర సీడ్‌ప్లాంట్ యజమాని దగ్గరకు వెళ్లి ఈ భూమి తమ అంటూ ముగ్గురు వ్యక్తులు బెదిరించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ముగ్గురిని స్థానికులు అడ్డుకుని బంధించి చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కరీంనగర్‌కు చెందిన గురజాల జయరామయ్య అనే వ్యక్తి భూమికొనుగోలు చేసి అదే స్థలంలో సంఘమిత్ర సీడ్స్ కార్పొరేషన్ పేరిట గోదాం నిర్మించాడు. కొనుగోలు చేసిన స్థలం చుట్టూరా ప్రహరీ గోడను నిర్మిస్తుండగా కరీంనగర్ జిల్లా రేణికుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాజు గౌడ్, కరుణాకర్,దివాకర్ లు వచ్చి ప్రహరీ గోడను అడ్డుకున్నారు. దీంతో స్థానికులు వారి బంధించి చెట్టుకుకట్టి వేశారు. తరువాత పోలీసులకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories