Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

Our Government Is Committed To Industrial Development Says Revanth Reddy
x

Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

Highlights

Revanth Reddy: పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు అందిస్తాం

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌తో ఫాక్స్కాన్‌కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజల ఆకాంక్షలను కాపాడే బాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్న రేవంత్‌.. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంభిస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories