ఎల్లుండి ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం.. 5 రోజుల పాటు ఢిల్లీలోనే..

ఢిల్లీలో రాజశ్యామల యాగం చేయనున్న సీఎం కేసీఆర్

R Tripura Malini
Updated on: 12 Dec 2022 9:30 PM IST
Opening of BRS office in Delhi
X

ఎల్లుండి ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం

BRS Office: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయల్దేరారు. 5రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉండనున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్‎ను ‎‌దేశవ్యాప్తంగా విస్తరించడంపై కేసీఆర్ దృష్టిపెట్టారు. అందులో భాగంగా ఢిల్లీలో ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎల్లుండి ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రేపు, ఎల్లుండి కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు ఇప్పటికే పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీ చేరున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story